ఐపీఎల్ బిజినెస్ ఊహించని రేంజ్‌లో పెరిగిపోతుంది. 2008లో ప్రారంభించబడిన IPL వేలంలో ఫ్రాంచైజీలు రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఈసారి 2025 వేలం కోసం ఫ్రాంచైజీలు ఏకంగా రూ.639.15 కోట్లను ఆటగాళ్ల కోసం వెచ్చించాయి.
Also Read: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!
గతంతో పోలిస్తే.. బిజినెస్ ఊహించని రేంజ్‌లో పెరిగిపోయింది. అంటి పెట్టుకున్న ప్లేయర్ల ఖర్చుతో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగింది. దీని బట్టి చూస్తే ఐపీఎల్ టోర్నమెంట్‌పై ఎంతలా బిజినెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..!
గతంలో హైయ్యెస్ట్ ధర
2024 ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇదే అతి పెద్ద సంచలనంగా మారింది. అమ్మో ఒక ప్లేయర్‌కు రూ.24 కోట్లా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.
Also Read: RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు..
అయితే ఇప్పుడు దానికి రెట్టింపు కావడంతో అంతా అవాక్కవుతున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ గత రికార్డులను బ్రేక్ చేశారు. రిషబ్ పంత్‌ను లక్‌నవూ రూ.27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు, వెంకటేష్ అయ్యర్‌ను కోల్ కతా రూ.23.75 కోట్లకు దక్కించుకున్నాయి.
Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ల టీమ్ లపై ప్రముఖ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఇందు కోసం వేల కోట్లు ఖర్చు చేసి జెర్సీపై తమ లోగో ఉండేందుకు ఫ్రాంచైజీలతో భారీ డీల్ కుదుర్చుకుంటున్నాయి.