/rtv/media/media_files/2025/03/27/jecp6SlAxMsCajS0z2sz.jpg)
IPL Passes:HCA Announces Complimentary Passes for Disabled Individuals for IPL 2025 Matches
క్రికెట్ ప్రియుల్లో ఐపీఎల్ సందడి ఫుల్ జోష్ నింపుతోంది. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ఎంతో మంది అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను తనివితీరా చూసి మురిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
ఫ్రీ పాస్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగనున్న IPL మ్యాచ్‌లను లైవ్‌లో చూడటం కోసం దివ్యాంగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఇందుకోసం వారికి ఉచిత పాస్‌లు అందించబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు దివ్యాంగులకు కాంప్లిమెంటరీ పాస్ లను అందించడానికి తమకు ఎంతో సంతోషంగా ఉందని HCA ప్రకటించింది.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
అందువల్ల ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కావాల్సిన వారు. పూర్తి పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడ్ అయ్యే డిజబులిటీ ఆధారాలు (స్కాన్ చేసిన కాపీ), ఇష్టపడే మ్యాచ్ వంటి వివరాలను [email protected] కు ఇమెయిల్ పంపడం వల్ల దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని..- దరఖాస్తులను చెక్ చేసి ప్రాధాన్యత ఆధారంగా మొదట వచ్చిన వారికి మాత్రమే ముందుగా పాస్‌లు అందించబడతాయని పేర్కొంది.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
(ipl-2025 | latest-telugu-news | telugu-news | hyderabad-cricket-association )