పాపం మ్యాచ్ కోసం ఫస్ట్ నైట్ క్యాన్సిల్.. అయిన ఓడిపోయిన సన్‌రైజర్స్

శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్ కోసం తన హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడు. కానీ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోొ ఓడిపోయింది.

New Update
Kamindu Mendis

Kamindu Mendis Photograph: (Kamindu Mendis )

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడిది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టులోకి శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ అరంగేట్రం చేశాడు. కావ్య పాప రూ.75 లక్షలకు ఇతన్ని వేలంలో  కొనుగోలు చేసింది. అయితే కమిందు ఇటీవల వివాహం చేసుకోవడంతో పాటు హనీమూన్‌కి కూడా ప్లాన్ చేసుకున్నాడు.

ఇది కూడా చూడండి:Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

కేవలం మ్యాచ్ కోసమే..

కేవలం మ్యాచ్‌ కోసం హనీమూన్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడట. కానీ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఓడిపోయింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం కమిందు స్పెషల్. అయితే ఈ మ్యాచ్‌లో కమిందు వేసిన ఒక ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. అయినా కూడా ఫలితం లేకపోయింది. 

ఇది కూడా చూడండి:Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

ఇదిలా ఉండగా మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 16 ఓవర్లలోనే 120 పరుగులకే ఆలౌటైంది.  క్లాసెన్ ఒక్కడే 33 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాద్ జట్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిగతా వాళ్లందరూ సింగిల్ డిజిట్లకే టపాటపా పడిపోయారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే చేతులెత్తేసింది. 

ఇది కూడా చూడండి:Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

Advertisment
తాజా కథనాలు