Jofra Archer: ఆర్చర్ విధ్వంసం.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ విధ్వంసం సృష్టించాడు. మొదటి ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్‌గా వచ్చిన ప్రియాంశ్, ఇతను ఔట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌ను పెవిలియన్ చేర్చాడు.

New Update
 Jofra Archer

Jofra Archer Photograph: ( Jofra Archer)

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్లో 4 వికెట్ల నష్టానికి 205 ప‌రుగులు చేసింది. అయితే భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ జట్టుకి రాజస్థాన్ బౌలర్లు మొదట్లోనే చుక్కలు చూపించారు. జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్‌లోనే విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్, సిమ్రాన్ క్రీజులోకి వ‌చ్చారు.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

మొదటి ఓవర్లలోనే..

ఇక జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్‌లో మొదటి బంతికే ప్రియాంశ్‌ను బౌల్డ్ చేశాడు. ఇతని తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ 6వ బంతికి శ్రేయాస్ అయ్యర్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్‌లో దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. బౌలింగ్ సమయంలో అయితే పంజాబ్ జట్టుకి చుక్కలు చూపించాడు. 

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
తాజా కథనాలు