IPL Auction : ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం నమోదైంది. ఈ మెగా వేళంలో నిలిచిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊహించిన ధర పలికాడు. కనీస ధర రూ.30 లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీపడ్డాయి.
Also Read : జనావాసాలపై కుప్పకూలిన బోయింగ్ విమానం
Also Read : POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు
8 ఏళ్లకే క్రికెట్ అకాడమీలో..
బిహార్‌లోని తాజ్‌పుర్ గ్రామానికి చెందిన వైభవ్ సూర్యవంశీ 2011లో జన్మించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు మీడియం ఫేస్ బౌలింగ్ కూడా వేయగల వైభవ్ 2024లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఔరా అనిపించాడు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓపెనర్ గా వచ్చి దూకుడైన ఆటతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న వైభవ్ ను నాలుగేళ్ల వయసు నుంచే అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రోత్సహించాడు. 8 ఏళ్లకే క్రికెట్ అకాడమీలో చేర్పించగా రెండేళ్లపాటు శిక్షణ తర్వాత 10 ఏళ్ల వయసులోనే అండర్ -16 జట్టులో చేరాడు.
Also Read : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!
Also Read : ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్..జాగ్రత్త అంటున్న అధికారులు!