IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ రిటెన్షన్ పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, తిలక్ వర్మను ముంబై అంటిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా తాము అయిదుగురం ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ల లాంటి వాళ్లమని హర్దీక్ అన్నాడు. అంతేకాదు ఎప్పటికీ తాము ఒకే పిడికిలిలా కలిసి ఉంటామంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇది నిజంగా గొప్ప నిర్ణయం..
‘మళ్లీ ముంబైకి ఆడే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా గొప్ప నిర్ణయం. నా జీవితంలో నేను సాధించినవన్నీ ముంబై ఇండియన్స్‌లో భాగమే. ప్రతి సీజన్ ప్రత్యేకమే అయినా ఈసారి మరింత ఆనందంగా ఉంది. 2013, 2015, 2017, 2019, 2020లో మేం అయిదుగురం ముంబైకి ప్రాతినిధ్యం వహించాం. ఈ 2025 సీజన్ లో మరింత బలంగా తిరిగొస్తాం. మేము విభిన్నమైన వ్యక్తులమే.. కానీ మా అయిదుగురికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మా మధ్య సోదరభావం, స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!
వారికి అధిక ప్రాధాన్యం దక్కాల్సిందే..
ఇక రిటెన్షన్ జాబితాపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ముంబై టీమ్ నిర్ణయం సరైనదే అన్నాడు. నేను టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాను కాబట్టి.. నాకు 4వ స్థానం సరైనదే. జాతీయ జట్టులో కీలక స్థాయిలో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం దక్కాల్సిందే. అదే నేను నమ్ముతా. జట్టు నిర్ణయంతో సంతోషంగానే ఉన్నానన్నాడు. రోహిత్ శర్మను ముంబై రూ.16.30 కోట్లకు జట్టు రిటైన్ చేసుకుంది. బుమ్రా రూ.18 కోట్లు, సూర్యకుమార్ రూ.16.35కోట్లు, పాండ్యా రూ.16.35 కోట్లు, తిలక్ వర్మను రూ.8 కోట్లకు అట్టిపెట్టుకుంది. మొత్తంగా రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు వెచ్చించగా రూ.45 కోట్లతో వేలానికి వెళ్లనుంది.
ఇది కూడా చదవండి: Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్!