/rtv/media/media_files/2024/11/01/wic2HqibVaOQnYWsMcIv.jpg)
Ind vs Nz: భారత్- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 235 పరుగులకు అలౌట్ అయింది. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదటినుంచి న్యూజీలాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 82, విల్ యంగ్ 71, కెప్టెన్ టామ్ లాథమ్ 28 పరుగులు చేశారు.
ఇది కూడా చదవండి: వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్!
A Washi-Jaddu show sent the Kiwis packing for a modest first innings score at the Wankhede. 💪
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 1, 2024
Let’s now turn the pressure into a solid lead; gents! 👊
📸: BCCI | #PlayBold #INDvNZ pic.twitter.com/zg84Vc8TG1
జడేజా అరుదైన ఘనత..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసని భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన జాబితాలో 5 స్థానానికి చేరుకున్నాడు. జడేజా 312 వికెట్లతో కొనసాగుతుండగా.. జహీర్ ఖాన్ (311), ఇషాంత్ శర్మ (311)ను జడేజా అధిగమించాడు.
ఇది కూడా చదవండి: ఇలియానా బర్త్ డే స్పెషల్.. ఆ చిన్న తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
ఇక ముంబైలో ఎండ తీవ్రత వల్ల ఆటగాళ్లు ఇబ్బందిపడ్డారు. 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతోపాటు ఉక్కపోత కారణంగా తరచూ బ్రేక్ తీసుకున్నారు. 25 ఓవర్లపాటు క్రీజ్‌లో పాతుకుపోయిన విల్ యంగ్, మిచెల్ వేడి తట్టుకోలేక డ్రింక్స్ బ్రేక్ సమయంలో మైదానంలోనూ కూర్చుండిపోయారు. ప్రస్తుతం భారత్ 30/1 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.