త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన! ఏపీలో ‘దీపం 2’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో గ్యాస్ సిలిండర్ల వాహనాలను పచ్చ జెండా ఉపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడేందుకు త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ తీసుకొస్తామన్నారు. By srinivas 01 Nov 2024 | నవీకరించబడింది పై 01 Nov 2024 16:51 IST in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి AP News: ఏపీలో ‘దీపం 2’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో జెండా ఊపి గ్యాస్ సిలిండర్ల వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతోన్న సమయంలో ప్రతీ గ్రామంలో ప్రజలకు కూటమి నేతలు అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మూడు గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీనికోసం ఏటా రూ.2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గత ముఖ్యమంత్రి సంక్షేమమ్ నాకంటే ఎవ్వరూ బాగా చేయలేరు అన్నారు. కానీ మేము చేసి చూపిస్తాం. జనసేన పోరాట పటిమతో ప్రజలకు చాలా ధైర్యం వచ్చింది. మాలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నా ఈ విజయం మీది. దాదాపు 14 సంవత్సరాల క్రితమే ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వచ్చా. ఇది మా గురువు గారి ఊరు అంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వెలుగు.. అలాగే అప్పుడు ఇక్కడకు వచ్చి దేవుణ్ణి ఒక్కటే అడిగా. నాకు ప్రజలకోసం పని చేసే శక్తి ఇవ్వు అని కోరుకున్నా. ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే నేను కూడా పరీక్షలు ఎదుర్కొన్నా. 14 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో వెలిగించిన దీపం ఈరోజు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వెలుగునిచ్చింది. ఈ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి 2 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం. ఇంత గొప్ప ఆలయం గురించి ప్రజలందరికీ తెలియాలి. ఇది తిరుమల లాంటి శక్తివంతమైన కేంద్రం. ఈ గుడికి సంబంధించిన 50 ఎకరాలను కూడా తిరిగి మళ్ళీ గుడికి వచ్చేలా చేస్తాం. ఇందాక వచ్చేటప్పుడు రోడ్ దిగి నడిచా.. గత ఐదేళ్లలో రోడ్లు నిర్వీర్యం చేశారు. అందుకే ఇక్కడకు కావాల్సిన రోడ్లు అన్ని తక్షణమే నూతన నిర్మించాలని చెప్పాం. చాలా తక్కువ సమయంలోనే రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ చింత చచ్చినా పులుపు చావలేదు.. ఇక జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడకు రావడానికి రెండున్నర గంటలు పట్టింది. అలా ఉంది జంగారెడ్డిగూడెం రోడ్. వైసీపీలో చింత చచ్చినా పులుపు చావలేదు. ఇలాగే చేస్తే మరో మాట కూడా రాకుండా చేస్తాం భవిష్యత్ లో. వైసీపీకు యుద్ధమే కావాలంటే కోరినంత యుద్ధం ఇస్తాం. అది కూడా మంచి కోసం చేసే యుద్ధమైతేనే. ఆడబిడ్డల మానప్రాణాలకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. రాబోయే కాలంలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ కూడా వస్తుంది. మేము ఏనాడు కూడా ఆడబిడ్డలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయలేదు. వైఎస్ షర్మిలకు కూడా భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వైసీపీ వాళ్ళు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. 2019లో 151 సీట్లు వచ్చినపుడు మోసం చేయని ఈవీఎంలు 2024 లో ఎలా మోసం చేస్తాయని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్! సనాతన ధర్మం కోసం చనిపోయే దాకా పోరాటం.. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి భజన చేశారు. ఇపుడు వారికి హనీమూన్ పిరీడ్ అయిపోయింది. ఉన్నతాధికారులకు ఆర్డర్స్ ను అమలు చేయడానికి ఎందుకు భయం? సనాతన ధర్మం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ‘నారసింహ వారాహి గళం’ పేరు మీద ఒక గళాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ గళం ఏపీ, తెలంగాణలో కూడా పని చేస్తుంది. సనాతన ధర్మం కాపాడడం కోసం చనిపోయే దాకా పోరాటం చేస్తా, అందులో సందేహం లేదని పవన్ స్పష్టం చేశారు. #cm-chandrababu #Dy CM Pawan Kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి