ABD: అతని కోసం రూ.3 కోట్లు పెట్టొచ్చు.. జిమ్మీకి డివిలియర్స్ మద్దతు!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. ఫ్రాంఛైజీ యజమానులలో తాను ఒకడినైతే జిమ్మీని రూ.3 కోట్లకు కొనుగోలు చేస్తానన్నాడు. అతని అనుభవం యువ బౌలర్లకు అవసరమన్నాడు.

dre
New Update

IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. అండర్సన్‌, ఎంఎస్ ధోనీ మధ్య పోలికలను వివరిస్తూ.. 42 ఏళ్ల అండర్సన్ రూ.1.25 కోట్ల కనీస ధరతో తన పేరు వేలంలో నమోదు చేసుకోవడం మంచి నిర్ణయంగా పేర్కొన్నాడు.  

Also Read : పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..

Also Read :  అందరికంటే ముందే ఆస్ట్రేలియా చేరిన కోహ్లీ.. పెర్త్‌లో అడుగుపెట్టగానే!

ధోనితో పోలిస్తే ఇది తక్కువే..

ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏబీడీ.. ‘ధోనీ వేతనం తగ్గించుకోడం, అండర్సన్‌ 1.25 కోట్ల కనీస ధరను సెట్‌ చేసుకోవడం నాకు ఒకేలా అనిపించాయి. అండర్సన్ బేస్ ధర రూ.1.25 కోట్లంటే నిజానికి ఇది తక్కువ. అయితే ఏ జట్టు కొనుగోలు చేస్తే.. అండర్సన్ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవచ్చు. కానీ బౌలర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోవడం గొప్ప విషయం. ఫ్రాంఛైజీ యజమానులలో నేను ఒకడినైతే అండర్సన్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేస్తా. ఎందుకంటే అతను మంచి అనుభవజ్ఞుడైన బౌలర్. యువ ఆటగాళ్లకు తన అనుభవాలు ఎంతో మేలు చేస్తాయి. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. మ్యాచ్‌ విజయం కోసం ఎలా బౌలింగ్ చేయాలో అతనికి బాగా తెలుసు' అంటూ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. 

Also Read : గంభీర్‌ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!?

Also Read : ఎట్టకేలకు తండ్రి కాబోతున్న భారత క్రికెటర్.. పోస్ట్ వైరల్!

 

#ipl-2025 #james-anderson #ab-de-villiers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe