Gambhir: గంభీర్‌ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!?

ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విఫలమైతే గంభీర్ ను హెడ్ కోచ్ పదవినుంచి బీసీసీఐ తప్పించబోతుందనే వార్తలను మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. గంభీర్‌ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్‌ తొలగించడం జరగనిపని‘ అన్నారు.

New Update
Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత క్రికెట్ హెడ్ కోచ్ గంభీర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి, ఇటీవల న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ దారుణ వైఫల్యం చెందడంతో కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటన గంభీర్ కు పరీక్షగా మారనుంది. ఈ మేరకు భారత్-ఆసీస్ మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ లో భారత్ విఫలమైతే ఫార్మాట్లను బట్టి కోచ్‌లను నియమించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. 

ఇది కూడా చదవండి: కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

గంభీర్‌ అడిగినవి మొత్తం బీసీసీఐ సమకూర్చింది..

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా దీనిపై స్పందిస్తూ.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌ జట్టు విఫలమైతే కోచ్‌గా గౌతం గంభీర్‌ మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. కానీ అదంతా పుకారే. ఫార్మాట్ల ఆధారంగా కోచ్‌లను నియమిస్తారని చెప్పడం తొందరపాటే. ఇదంతా తప్పుడు ప్రచారమే. గంభీర్‌ హెడ్‌కోచ్‌గా ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అలాంటప్పుడు ఆటగాళ్లు బాగా ఆడకపోతే కోచ్‌ తొలగించడం అనేది జరగని పని’ అన్నారు. అలాగే గంభీర్‌ అడిగినవి మొత్తం బీసీసీఐ సమకూర్చించిందని, కాబట్టి ఫలితాలకు బాధ్యత మొత్తం గంభీర్ దే అన్నాడు. 

ఇది కూడా చదవండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీవీఎస్‌ లక్ష్మణ్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీ20 జట్టుకు స్టాండ్‌ ఇన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తం నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్ 1-0తో అధిక్యంలో నిలిచింది. 11వ తేదిన రెండో టీ20 జరగనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు