ABD: అతని కోసం రూ.3 కోట్లు పెట్టొచ్చు.. జిమ్మీకి డివిలియర్స్ మద్దతు!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. ఫ్రాంఛైజీ యజమానులలో తాను ఒకడినైతే జిమ్మీని రూ.3 కోట్లకు కొనుగోలు చేస్తానన్నాడు. అతని అనుభవం యువ బౌలర్లకు అవసరమన్నాడు.