Hockey Asia Cup: హాకీ ఆసియా కప్ ఫైనల్స్ కు టీమ్ ఇండియా

భారత్ లో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో టీమ్ ఇండియా అదరగొడుతోంది. ఈరోజు సెమీ ఫైనల్స్ లో చైనాపై 7-0 తో గోల్స్ తో విజయం సాధించింది.  ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో ఆడనుంది. 

New Update
asia cup

Hockey Asia Cup

హాకీ ఆసియా కప్ ల భారత టీమ్ దుమ్ము రేపుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ఫైనల్లోకి దూసుకెళ్లింది హర్మన్ ప్రీత్ సేన.  స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశతో పాటూ సూపర్ 4 మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. బీహార్ లో ఈరోజు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో చైనాపై  7-0 తో గోల్స్ తో ఘన విజయం సాధించింది. దీంతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. నాలుగో ఆసియా కప్ టైటిల్ కోసం దక్షిణకొరియా తో టీమిండియా తలపడనుంది. 

తొమ్మిదిసార్లు ఆసియా కప్ ఫైనల్ కు..

ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదటి సగంలోనే  శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ తలా ఒక గోల్ చేయడంతో 3-0తో ఆధిక్యం సాధించింది. తరువాత రెండో అర్ధ భాగంలో రాజ్‌కుమార్ పాల్, సుఖ్‌జీత్ సింగ్ చెరొక గోల్ చేసి చైనాపై ఒత్తిడి పెంచారు. దాంతో.. ప్రత్యర్థి జట్టు సభ్యులు గోల్ చేసేందుకు నానా పాట్లూ పడ్డారు. కానీ.. ఆఖర్లో అభిషేక్ నైన్ రెండు గోల్స్‌ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. తాజా విజయంతో హర్మన్ ప్రీత్ సింగ్ టీమ్ తొమ్మిదిసార్లు ఆసియా కప్ ఫైనల్లో చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది.  రేపు ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే 2026 హాకీ వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తారు. 

Advertisment
తాజా కథనాలు