Asia Cup 2025: దాయాదిని చితక్కొట్టిన టీమ్ ఇండియా..పాక్ పై మ్యాచ్ లో ఘన విజయం

పాకిస్తాన్ పై మ్యాచ్ లో విజయం ఎప్పుడూ తమదేనని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో దాయాదిని చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.

New Update
Team India (2)

ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు దుబాయ్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు హార్దిక్పాండ్యా ఫస్ట్ ఓవర్ లోనే బిగ్ షాకిచ్చాడు. తొలి బంతికే ఓపెనర్‌ సయిమ్‌ అయూబ్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. అనంతరం జస్‌ప్రీత్బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ హారిస్‌ (3) వెనుదిరిగాడు. ఆరు పరుగుల వ్యవధిలోనే పాక్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం ఫర్హాన్ (3), ఫకర్‌ జమాన్‌ (17) ఆచితూచి ఇన్సింగ్స్ ఆడారు. వికెట్లు పడుతున్న సాహిబ్‌జాదా ఫర్హాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చివరకు కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో హార్దిక్పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో షాహీన్ అఫ్రిది 4 సిక్సులతో చెలరేగడంతో పాక్ ఆ మాత్రం స్కోరు అయిన చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, జస్‌ప్రీత్బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు, హార్దిక్పాండ్యా,వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

బ్యాటింగ్ అదరగొట్టారు..

తరువాత 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా సునాయాసంగానే పరుగులు చేసింది. మొదట్లోనే ఓపెనర్ గిల్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ అభిషెక్ శర్మ కూడా వికెట్ పోగొట్టుకున్నాడు. రెండో ఓవర్లో 10 పరుగుల దగ్గర గిల్ మొదటగా అవుట్ అయ్యాడు. దాని తరువాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. అయితే నాలుగో ఓవర్లో 41 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ తన వికెట్ ను కోల్పోయాడు. కానీ తరువాత బరిలోకి దిగిన కెప్టెన్ సూర్యకుమార్, తిలక్ వర్మలు నిలకడగా ఆడుతూనే...వేగంగా పరుగులు కూడా చేశారు. దీంతో భారత్ తన లక్ష్యాన్ని ఈజీగానే ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివర వరకు ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. అయితే చివరల్లో తిలక్ వర్మ అయూబ్ బౌలింగ్ లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో శివమ్దూబే క్రీజులోకి వచ్చాడు. దీని తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గేర్ మార్చాడు. వేగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాడు. టీమ్‌ఇండియా విజయానికి 36 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో భారత బ్యాటర్లు 10 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత అయూబ్ బౌలింగ్ లో 13 పరుగులు వచ్చాయి. చివర్లో సూపర్ సిక్స్ తో స్కై మ్యాచ్ ను ముగించాడు. దీంతో 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమ్ ఇండియా పాకిస్తాన్ పై ఘ విజయం సాధించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. 

ఈ మ్యాచ్ లో భారత్..పాకిస్తాన్ ను అన్ని విధాలా అవాయిడ్ చేసింది. మ్యాచ్ కు బీసీసీఐ నుంచి ఎవరూ రాలేదు. ముందే చెప్పినట్టుగా ఇన్విసబుల్ బాయ్ కాట్ చేసింది. ఐసీసీ, ఏసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడుతున్నాము కానీ పాకిస్తాన్ తో దూరంగానే ఉంటామని తెలిపింది. ఇక భారత జటట్టు కూడా అదే విధంగా ప్రవర్తించింది. మొత్తం మ్యాచ్ అంతా పాకిస్తాన్ జట్టుకు దూరంగానే ఉంటూ వచ్చింది. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబేలు దాయాది జట్టుతో కరచాలనం చేయకుండానే పోడియంకు వచ్చేశారు. 

Advertisment
తాజా కథనాలు