Jaspreet Bumrah: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు

ఇంగ్లండ్‌తో 3వ టెస్ట్‌లో బుమ్రా చరిత్ర సృష్టించాడు. విదేశాల్లో 13వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో కపిల్ దేవ్ (12) రికార్డును బద్దలు కొట్టాడు. సేనా దేశాల్లో 150 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచి వసీం అక్రమ్‌ను అధిగమించాడు.

New Update
india vs england 3rd test jasprit bumrah creates history

india vs england 3rd test jasprit bumrah creates history

ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 23 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌ వికెట్‌లను పడగొట్టాడు. దీంతో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. 

Also Read: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

india vs england 3rd test

ఈ మ్యాచ్‌లో బుమ్ బుమ్ బుమ్రా లెజెండరీ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. విదేశాల్లో టెస్ట్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 13వ సారి ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 12 సార్లు ఈ ఘనత సాధించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను బుమ్రా అధిగమించాడు. ఈ విషయంలో ఇషాంత్ శర్మ (9 సార్లు) మూడో స్థానంలో ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

jasprit bumrah creates history:

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేసి, టెస్ట్ క్రికెట్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన భారత బౌలర్‌గా నిలిచి, దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. 

Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇలా విదేశాల్లో 13వ సారి ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో గతంలో కపిల్ దేవ్ పేరు మీద ఉన్న 12 ఐదు వికెట్ల రికార్డును అధిగమించి ఈ ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆసియా బౌలర్: బుమ్రా తన వికెట్లతో కలిపి ‘‘సేనా’’ దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ (146 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో బుమ్రాకి ఇది 15వ ఐదు వికెట్ల ప్రదర్శన. 

విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు

13- జస్ప్రీత్ బుమ్రా (35* టెస్టులు)
12- కపిల్ దేవ్ (66 టెస్టులు)
9- ఇషాంత్ శర్మ (63 టెస్టులు)
8- జహీర్ ఖాన్ (54 టెస్టులు)
7- ఇర్ఫాన్ పఠాన్ (15 టెస్టులు)

Advertisment
Advertisment
తాజా కథనాలు