భారత్ సెమీస్‌కు చేరాలంటే.. ఆసీస్‌పై తప్పకుండా గెలవాల్సిందేనా?

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ రోజు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిందే. భారీ రన్‌రేట్‌తో భారత్ గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశాలు ఉంటాయి.

T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్‌ టూ యూఏఈ!
New Update

మహిళల టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో మ్యాచ్‌లు జరుగుతుండగా.. దీని నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌కు తన బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్ మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది.

ఇది కూడా చూడండి: దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు

భారీ రన్‌ రేట్‌తో గెలిస్తేనే..

ఇదిలా ఉండగా.. ఈ రోజు ఆస్ట్రేలియా, ఇండియాకి జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలవాల్సిందే. జోరు మీద ఉన్న ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో భారత్ గెలిస్తే రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. న్యూజిలాండ్ ఆడే మ్యాచ్ బట్టి ఉంటుంది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లో కాకపోయిన ఒక మ్యాచ్‌లో అయిన ఓడిపోతేనే భారత్‌కు సెమీస్ బెర్త్ కాయం అవుతుంది. మరి ఈ రోజు మ్యాచ్‌లో మహిళలు ఏం చేస్తారో చూడాలి. 

ఇది కూడా చూడండి: Breaking: ముంబై లో దారుణం- కీలక నేత బాబా సిద్దిఖీ కాల్చివేత!

#india #australia #womens-t20-world-cup-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe