దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు.

New Update
FotoJet (23

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారు. పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడతారు. ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవాన్ని ప్రజలు నిర్వహించారు. అయితే ఈ కర్రల సమరంలో హింస చెలరేగింది. ఎలాంటి హింసకు చోటు ఇవ్వకుండా ప్లాన్ చేసిన కూడా ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

బైక్ అదుపు తప్పడంతో..

మరోవైపు ఈ ఉత్సవాలను చూడటానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఒకరు చనిపోగా.. ఇంకోకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో దేవరగట్టులో ప్రతీ ఏడాది ఈ కర్రల సమరం దసరా పండుగ రోజు జరుగుతోంది. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న మాళ మల్లేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఇక్కడ చేసే దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందట. 

ఇది కూడా చూడండి: America:ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉంది...అధ్యక్షురాలిగా సరైన క్యాండిడేటే!

దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపున.. అరికెర, అరికెరతండా, కురుకుంద, బిలేహాల్, సుళువాయి, ఎల్లార్తి, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపున కర్రలతో యుద్ధానికి దిగుతారు. ఈ క్రమంలో బన్నీ ఉత్సవంలో కొంతమంది గాయపడతారు.. వీరిని ఆసుపత్రికి కూడా తరలిస్తారు. ఇలా కొట్టుకోవడం, గాయపడటం ఈ ఉత్సవాల్లో సాధారణం. బన్ని  ఉత్సవాల్లో స్వామి వారికి పిడుకెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. 

ఇది కూడా చూడండి:  నువ్వా–నేనా అంటున్న కమలా, ట్రంప్..ఫలితాన్ని నిర్ణయించనున్న స్వింగ్ స్టేట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు