/rtv/media/media_files/GjJcI4c1gyAmuQBibuPH.jpg)
ముంబైలోని బాంద్రా లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హిందీ చిత్ర పరిశ్రమతో కూడా సంబంధాలున్న హై-ప్రొఫైల్ పొలిటీషియన్ సిద్ధిఖీని విజయ దశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
“ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ చెప్పారు. వారిలో ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హర్యానాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలోఉన్నట్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు,” షిండే తెలిపారు.
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆసుపత్రికి వెళ్లి బాబా సిద్దిఖీ కుటుంబాన్ని పరామర్శించారు. తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై అజిత్ పవార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
#WATCH | Baba Siddique | Mumbai, Maharashtra: BJP leader Kirit Somaiya says, "Baba Siddique's murder is a matter of concern. The government should make a special team and investigate this. It seems to be a huge conspiracy. Strict action should be taken..." pic.twitter.com/jjCs0zvrDV
— ANI (@ANI) October 12, 2024
బాణసంచా పేల్చుతుండగా..
విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై ఈ దాడి జరిగింది. రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సిద్దిఖీ టపాసులు పేల్చుతుండగా ముగ్గురు దుండగులు ముఖానికి కండువా కప్పుకుని వాహనంలో నుంచి కిందకి దిగి వచ్చి ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
Shocked and numbed to hear about the firing at Shri Baba Siddiqui ji. What is going on in the city? How can this happen? At a loss of words.
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) October 12, 2024
ఎన్సీపీ నేత కడుపు, ఛాతీలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాడి విషయాన్ని గమనించిన సిద్దిఖీ సహచరులు సిద్ధిఖీని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.బాబా సిద్దిఖీని దుండగులు ఎందుకు చంపారు? ఆయన్ని ఎవరైనా చంపించారా? దీని వెనుక ఎవరున్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ ఘటనలో బాబా సిద్దిఖీ సహచరుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ ఈ ఏడాది మార్చ్‌లో కాంగ్రెస్‌ని వీడి ఎన్సీపీలో చేరారు. సిద్ధిఖీ 2000 ప్రారంభంలో కాంగ్రెస్-అవిభాజ్య ఎన్సీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు.