/rtv/media/media_files/2025/07/30/aus-bowler-2025-07-30-21-17-56.jpg)
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త రికార్డను నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 18 బంతులు వేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఒకే ఓవర్‌లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ స్థానికుడు రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ప్రైమస్ ఒకే ఓవర్‌లో 13 బంతులు బౌలింగ్ చేశాడు. హేస్టింగ్స్ ప్రైమస్ రికార్డును బద్దలు కొట్టి చెత్త రికార్డును సృష్టించాడు.
John Hastings, Once a CSkian, always a CSkian 😭😭
— BlackGold✨ (@b1ackgoldd) July 30, 2025
Meanwhile Pathirana be like challenge accepted 💀 https://t.co/4iPLsiLXsF
పాకిస్తాన్ పటిష్ట స్థితిలో ఉండగా
పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు 75 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. ఏడో ఓవర్‌లో 55/0 స్కోరుతో పాకిస్తాన్ పటిష్ట స్థితిలో ఉండగా, ఆస్ట్రేలియా కెప్టెన్ బ్రెట్ లీ బంతిని జాన్ హేస్టింగ్స్‌కు అప్పగించాడు. ఆ ఓవర్‌లో హేస్టింగ్స్ బౌలింగ్ ఇలా సాగింది. 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఒక నో బాల్ వేశాడు. ఈ ఓవర్ లో అతను కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మొత్తం 20 పరుగులు ఇచ్చాడు. 74 పరుగుల చిన్న లక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆసీస్ ఈ రికార్డును నెలకొల్పింది. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్ట్, 29 వన్డేలు,9 టీ20లు ఆడిన అనుభవజ్ఞుడైన బౌలర్. ఐపీఎల్‌లో అతను 3 మ్యాచ్‌లు ఆడాడు.
10 వికెట్ల తేడాతో ఓడించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడి నుండి ఇలాంటి ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 7.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా అద్భుత ఆటను ప్రదర్శించింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేయగా, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి పాకిస్థాన్‌ను విజయపథంలో నడిపించాడు.
ఫైనల్‌కు పాకిస్తాన్
మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నుంచి భారత్ వైదొలగింది. దీంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో పాకిస్తాన్ ఛాంపియన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ సెమీ-ఫైనల్ నుండి వైదొలగడంతో, పాకిస్తాన్ ఛాంపియన్స్ అధికారికంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత జట్టు లీగ్ దశలో పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను కూడా బహిష్కరించింది, అప్పుడు కూడా పాకిస్తాన్‌కు పాయింట్లు లభించాయి.