Mohammed Shami: మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక ప్రకటన!

భారత క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. రాజ్ కోట్‌లో జరిగే మూడో టీ20ఐ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షమీ ఫిట్‌గా ఉన్నాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు.

New Update
Mohammed Shami fitness

Mohammed Shami fitness news

గత ఏడాది కాలంగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తీవ్ర గాయాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దీని కారణంగా టీమిండియా తరఫున ఏ ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్, షమీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. షమీ త్వరగా కోలుకుని టీంలో మళ్లీ రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

అయితే ఇప్పుడిప్పుడే షమీ ఫిట్ గా ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టీ20 సిరీస్ లోని మూడో మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షమీ ఫిట్ నెస్ పై తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అదిరిపోయే అప్డేట్ అందించాడు. 

ఇది కూడా చూడండి:Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

షమీ పూర్తిగా కోలుకున్నాడు

ఈ మేరకు మహ్మద్ షమీ పూర్తిగా కోలుకున్నాడని కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ఆయన ప్రకటనతో ఇంగ్లాండ్ తో మూడో టీ20లో షమీ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కోట్ లో మూడో టీ20కి ముందు ఆయన మాట్లాడాడు. ''మహ్మద్ షమీ ఫిట్ గా ఉన్నాడు. అతడు ఏ మ్యాచ్ లో ఆడాలనేది మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుంది" అని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చూడండి:Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

దీంతో రాజ్ కోట్ లో జరగనున్న మూడో టీ20లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక రెండు టీ20 మ్యాచ్ లలో షమీకి అవకాశం రాలేదు.. మరి మూడో టీ20 మ్యాచ్ కు షమీ వస్తే ఆ లెక్కే వేరే అని చెప్పాలి. మొత్తంగా షమీ రీఎంట్రీ కోసం భారత క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లోకి షమీ వస్తే మాత్రం రవి బిష్ణోమ్ ని టీమ్ నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు