ఇలియానా బర్త్ డే స్పెషల్.. ఆ చిన్న తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా.. ఒక చిన్న తప్పుతో సినీ కెరీర్ నే నాశనం చేసుకుంది. నేడు ఇలియానా బర్త్ డే సందర్భంగా ఆమె మూవీ కెరీర్ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
ileaba

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న గోవా బ్యూటీ ఇలియానా బర్త్ డే ఈ రోజు. ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న  ఈమె.. ఒక చిన్న తప్పుతో సినీ కెరీర్ నే నాశనం చేసుకుంది. నేడు ఇలియానా బర్త్ డే సందర్భంగా ఆమె మూవీ కెరీర్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

publive-image

రామ్ పోతినేని సరసన 'దేవదాస్' సినిమాతో హీరోయిన్ తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఇలియానా.. 'పోకిరి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలోనూ నటించినా.. అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. 

Also Read : ఆ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ.. 2029 ఎన్నికలే టార్గట్ : నాగవంశీ

fcsdf

ఆ ఒక్క మిస్టేక్ చేసుండకపోతే..

సౌత్ లో స్టార్ గా వెలుగొందుతున్న టైం లో ఇలియానా చేసిన ఒక్క మిస్టేక్ ఆమె కెరీర్ నే నాశనం చేసేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న టైం లోనే ఇలియానా 'బర్ఫీ' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీ సినిమాలు చేస్తూనే సౌత్ డైరెక్టర్స్ ని కించపరిచేలా కామెంట్స్ చేసింది. దాంతో ఇలియానాను సౌత్ డైరెక్టర్స్ పట్టించుకోవడమే మానేశారు. 

publive-image

ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఇలియానా కెరీర్ పై బిగ్ ఇంపాక్ట్ చూపించాయి. దాని ఫలితంగా ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది. 2012-18 మధ్య కాలంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. 

Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'విశ్వం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

publive-image

2018లో రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' చేసింది. ఇది డిజాస్టర్ అయింది. దీని తర్వాత ఒకటి రెండు హిందీ సినిమాలు చేసింది. కానీ అస్సలు కలిసిరాలేదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీని విడిచిపెట్టడం ఇలియానా చేసిన పెద్ద తప్పని ఇప్పటికీ పలు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. బాలీవుడ్ కు వెళ్లకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉంది ఉంటే ఇప్పటివరకు ఇలియానాకు తిరుగుండేది కాదేమో.

publive-image

#ileana-birthday-special #actress-ileana
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు