వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్! భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై ఆసీస్ ఆటగాడు లబుషేన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. టీమ్ ఇండియా ప్లేయర్లంతా చాలా డేంజర్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఎంతటివారైనా తాము అడ్డుకొని తీరుతామంటూ సవాల్ విసిరాడు. By srinivas 01 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి మరో రెండు వారాల్లో నవంబర్ 22 నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ఇరుజట్లు ఇప్పటినుంచే సిరీస్ చేజిక్కించుకోవాలని తహతమలాడుతున్నాయి. ఇందులో భాగంగానే హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో వస్తున్న భారత్‌ను అడ్డుకొని తీరతామని ఆస్ట్రేలియా ఆటగాళ్లు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఏ బౌలరైన సరే అడ్డుకొని తీరుతామంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు.. ఈ మేరకు లబుషేన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడానికి ఇరుజట్లకూ ఈ సిరీస్ చాలా కీలకం. భారత్‌తో టెస్టు సిరీస్ అంటే ఒత్తిడి ఉండటం సహజమే. ప్రతిసారీ ఇరుజట్లూ విజయం కోసం చివరివరకూ పోరాడతాయి. అయితే 6 నెలల తర్వాత ఆసీస్ టీమ్ టెస్టు క్రికెట్ ఆడబోతుంది. దేశవాళీ క్రికెట్‌లో మా ప్లేయర్లు ఫిట్‌నెస్, ఫామ్ సాధించారు. ఇప్పుడు మేం వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఆడబోతున్నాం. మా బౌలర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న జట్టులో అనుభవం, నైపుణ్యం కలిగిన క్రికెటర్లు ఉన్నారు’ అని అన్నాడు. ఇది కూడా చదవండి: బాయ్ ఫ్రెండ్ తో బుల్లితెర నటి ఫోజులు.. ఫొటోలు వైరల్ ఇంకా నిర్ణయించలేదు.. ఇక వన్‌డౌన్, సెకండ్‌డౌన్ ఎవరు వస్తారనేది ఇంకా నిర్ణయించలేదన్న లబుషేన్.. స్టీవ్ స్మిత్, తాను ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పాడు. కామెరూన్ గ్రీన్ లేకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేస్తోందని, పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని భావించినా గాయం కారణంగా అతను సిరీస్‌కు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు. భారత బౌలింగ్ విభాగంలో ప్రతిఒక్కరూ డేంజరే. జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి కఠినంగా శ్రమించాలి. బుమ్రా బంతిని అంచనా వేయడం కష్టం. అశ్విన్ నుంచి మాకు సవాల్ ఎదురవుతుంది. అయినా మేము పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాం. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వారిపై ఒత్తిడి తీసుకొస్తాం. భారత యువకులను అంత తేలిగ్గా తీసుకోమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు షాకిచ్చిన కొడుకు అయాన్.. ఓపెన్ గా ఆ హీరోకు సపోర్ట్ #ind-vs-aus #test-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి