Ind Vs Nz : రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులోకి ఆల్ రౌండర్ ఎంట్రీ
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు ముందు సుందర్ జట్టుతో కలవనున్నాడు.