IND Vs ENG: భారత్‌కు చెమటలు.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్..

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్‌తో జరుగుతోన్న నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని భారత్‌ ముందు ఉంచింది.

New Update
IND Vs ENG

IND Vs ENG

భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇది ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు ఒక అద్భుతమైన ప్రదర్శన. ముఖ్యంగా జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) సెంచరీలతో భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. 

Also Read:ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

IND Vs ENG 

భారత్ తరపున రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్‌లో మొదటిసారిగా ఒకే ఇన్నింగ్స్‌లో 100 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. ఈ భారీ స్కోరుతో ఇంగ్లాండ్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లకు రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యం ఎదురుచూస్తోంది. ఈ పిచ్‌పై బంతి విచిత్రంగా బౌన్స్ అవుతూ ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్‌లకు ఇది సవాలుగా మారనుంది. 

Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. జో రూట్ (150 పరుగులు), బెన్ స్టోక్స్ (141 పరుగులు) సెంచరీలతో విజృంబించారు. వీరిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇలా ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా (2 వికెట్లకు 112 పరుగులు), మహ్మద్ సిరాజ్ (1 వికెట్‌కు 140 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (2 వికెట్లకు 107 పరుగులు) వంటి ప్రధాన బౌలర్లు ఈ ఇన్నింగ్స్‌లో 100 పరుగులకు పైగా సమర్పించుకోవడం గమనార్హం. భారత బౌలర్లు గత పదేళ్లలో విదేశాల్లో 500+ పరుగులను ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉండటంతో.. ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం భారత్‌కు అత్యవసరం. 

Advertisment
తాజా కథనాలు