Australian Cricket : . ఆస్ట్రేలియాను వదిలేయండి... చెరో రూ.58 కోట్లు ఇస్తాం.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బంపరాఫర్!

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

New Update
aus

ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లలో మాత్రమే ఆడటం కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందుకు ఓ షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరపున ఆడటం మానేయాలి.  

ఇద్దరూ  తిరస్కరించారు.

ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన ప్రపంచవ్యాప్త టీ20 లీగ్‌లలో (దక్షిణాఫ్రికాలోని SA20, యు.ఏ.ఈ.లోని ILT20 వంటివి) పూర్తి సమయం అందుబాటులో ఉండాలి. ఈ ఆఫర్ వారి ప్రస్తుత ఆస్ట్రేలియా కాంట్రాక్ట్, ఐపీఎల్ జీతం కంటే చాలా రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆఫర్‌ను పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ  తిరస్కరించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తమ నిబద్ధత, దేశం కోసం ఆడాలనే ఆసక్తి కారణంగా వారు ఈ భారీ మొత్తాన్ని వదులుకున్నారు.

కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తరపున ఆడుతున్నారు. కమిన్స్ SRH కెప్టెన్‌గా ఉండగా, హెడ్ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. పాట్ కమిన్స్‌ ను ఏడాదికి రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక అతనికి ఏడాదికి ఆస్ట్రేలియా తరుపున కాంట్రాక్ట్‌ రూపంలో రూ. 8.74 కోట్లు వస్తాయి. ఈ రెండు కలుపుకుంటే అతడికి రూ. 17.50 కోట్ల వరకూ వస్తాయి. అతని  మొత్తం వార్షిక ఆదాయం సుమారు రూ. 35-40 కోట్ల వరకు ఉంటుంది.

ఇక ట్రావిస్ హెడ్‌ విషయానికి వస్తే  ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి రూ. 8.70 కోట్లు వస్తాయి. మొత్తం వార్షిక ఆదాయం సుమారు రూ. 25-30 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఈ భారీ ఆఫర్లు ఫ్రాంచైజీ క్రికెట్ ప్రభావం అంతర్జాతీయ క్రికెట్‌పై పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది, అయితే కమిన్స్,  హెడ్ వంటి ఆటగాళ్లు దేశం కోసం ఆడటానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు