SRH VS KKR: అరే ఇదేదో ముందే ఆడొచ్చు కదరా..క్లాసెన్ , హెడ్ విధ్వంసం..

ఐపీఎల్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్, కోలకత్తా మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చితకొట్టారు. క్లాసెన్, హెడ్ రెచ్చిపోవడంతో ఎస్ఆర్హెచ్ 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. 

New Update
ipl

SRHVS KKR

మొదటి నుంచీ ఇలానే ఆడి ఉంటే హైదరాబాద్ ఆ జట్టుకు తిరుగులేకుండా పోయేది. అసలు ఇవే అంచనాలు హైదరాబాద్ జట్టు మీద ఉన్నాయి. చివరి మ్యాచ్ లలో ఎస్ఆర్హెచ్ మెరుపులు మెరిపిస్తోంది. ఐపీఎల్ లో ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 279 పరుగులు భారీ స్కోరును చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులలతో చితక్కొట్టగా.. ట్రావిస్ హెడ్  40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులు, అభిషేక్ శర్మ  16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశారు. చివర్లో ఇషాన్ కిషన్ కూడా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు.కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు.

 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-kkr | match 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు