Hit Man: ఐపీఎల్ కు ముందు మాల్దీవుల్లో రోహిత్ శర్మ చిల్..

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. ఖరీదైన రిసార్ట్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు. 

New Update
rohith

Rohith sharma with family

ఐపీఎల్ మొదలైతే క్రికెట్లు అందరూ రెండు నెలలు ఫుల్ బిజీ అయిపోయాతారు. వరుసగా మ్యాచ్ లు ఆడుతూ అటుఇటూ తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజుల క్రితమే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా ప్లేయర్లు పెద్ద గ్యాప్ లేకుండానే ఐపీఎల్ కు సిద్ధమవుతున్నారు. దీంతో మధ్యలో దొరికిన కాస్త సమయంలో చిల్ అవుతున్నారు. తాజాగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు. ఇక్కడ వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషి అనే లగ్జరీ రిసార్ట్‌లో రోహిత్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఒక్క రోజుకు 23 లక్షలు..

రోహిత్ మాల్దీవుల్లోనే ఉన్న అత్యంత విలాసవంతమైన లగ్జరీ రిసార్ట్ లో స్టే చేశాడు. వాల్డోర్ఫ్ ఆస్టోరియా..మాల్దీవుల్లో అతి పెద్ద ఐలాడ్ లలో ఒకటి. ఇక్కడ ఎంతో విశాలవంతంగా, ప్రశాంత వాతవరణంలో రీఫ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లా, బీచ్ విల్లాలు ఉంటాయి. ఇందులో రీఫ్ విల్లాలో రోహిత్ సేదతీరాడని చెబుతున్నారు. దీని ఖరీదు ఒక్క రోజుకు 23 లక్షలని చెబుతున్నారు.  ఇందులో అన్ని విలాసవంతమైన సౌకర్యాలుంటాయి. ఇదొక త్రీ బెడ్ రూం విల్లా. ఇందులోనే రోహిత్ సైకి్ రైడ్ చేస్తూ...అతని కూతురు వాటర్ పార్క్ లో ఆడుకుంటూన్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు రోహిత్. 

ఈ టూర్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో జాయిన్ అవ్వనున్నాడు. టీమ్ తో కలిసి ప్రాక్టీస్ సెషనలో కూడా పాల్గొననున్నాడు. మార్చి 23న ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్ ను ఆడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్ గా వహించనున్నాడు. ఐపీఎల్‌ 2024లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా హార్దిక్‌ పాండ్యపై ఓ మ్యాచ్‌ నిషేధం పడటంతో సూర్య బాధ్యతలు తీసుకున్నాడు. 

Also Read: AP: తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు