GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 23వ మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. రాజస్తాన్ ముందు 218 టార్గెట్ ఉంది.

New Update
GT vs RR Live score IPL 2025

GT vs RR Live score IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఉంది. 

మొదట క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ మెల్లి మెల్లిగా ఆడారు. కానీ ఆదిలోనే గుజరాత్‌కు బిగ్ షాక్ తగిలింది. శుభమన్ గిల్ ఔటయ్యాడు. కేవలం 3 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతికి శుభ్‌మన్‌ గిల్‌ (2) బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి సాయి సుదర్శన్, బట్లర్ కలిసి మంచి స్కోర్ రాబట్టారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

ఇద్దరూ బ్యాటింగ్ స్పీడ్ పెంచులూ పరుగుల వరద తెప్పించారు. కానీ బట్లర్ ఔటై షాకిచ్చాడు. 25 బంతుల్లో 36 పరుగులు రాబట్టి పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు సాయి సుదర్శన్ తన దూకుడు ఆపలేదు. వికెట్లు పడినా పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులు, సాయి సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులు సాధించారు. అలాగే రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు రాబట్టారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేశారు. 

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

చుక్కలు చూపించిన సుదర్శన్

రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు