BIG BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ క్రికెటర్!

భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసింది.

New Update
crickter

భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె రిటైర్మెంట్ ప్రకటనలో "హైదరాబాద్‌లోని ఇరుకైన వీధుల నుండి ప్రపంచ క్రికెట్ పెద్ద వేదికల వరకు నా ప్రయాణం ఒక కల లాంటిది" అని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసింది. 37 టీ20ల్లో, ఆమె 26.27 సగటుతో, 5.73 ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టింది.

Also Read :  Crime : ఎంతకు తెగించావ్ రా...  అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చంపేశాడు!

గౌహెర్ చివరిసారిగా 2014లో పాకిస్తాన్ పై ఆడింది. దేశీయ క్రికెట్‌లో గౌహెర్, హైదరాబాద్, పుదుచ్చేరి, రైల్వేస్, బెంగాల్ తరపున ఆడింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండు సీజన్లలో ఆమె యూపీ వారియర్జ్ తరపున నాలుగు మ్యాచ్ లు ఆడింది. సుల్తానా 2009, 2013లో రెండు వన్డే ప్రపంచ కప్‌లలో పాల్గొంది, పదకొండు మ్యాచ్‌లలో 30.58 సగటుతో పన్నెండు వికెట్లు తీసింది. 2009 నుండి 2014 వరకు మూడు టీ20 ప్రపంచ కప్‌లలో 5.81 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు తీసింది.

హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగి

గౌహెర్ సుల్తానా హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి పెంచుకుని, అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించుకుంది.2008లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. భారత్ తరపున 50 వన్డేలు, 37 టీ20లు ఆడారు. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, గాయాలు ఎదుర్కొన్నా, క్రికెట్‌పై తనకున్న ప్రేమను వదలకుండా ఆమె పోరాడింది. ఆమె కథ చాలామందికి స్ఫూర్తినిస్తుంది.

Also read: AP Crime: అయ్యో బిడ్డలు.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఈత సరదా.. ఎంతమంది చనిపోయారంటే?

Advertisment
తాజా కథనాలు