/rtv/media/media_files/2025/03/09/phLpji8xthhsvCIil3CB.jpg)
New zeland Team
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా, స్యూజిలాండ్ జట్లు గ్రూప్ మ్యాచ్ లో ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. భారత జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే అంత మాత్రానా ఆ టీమ్ ను అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. భారత్ తో తప్ప కీవీస్ టోర్నీలో మిగతా అన్ని మ్యాచ్ లలో భారీ విజయాన్ని సాధించింది. ఈ జట్టులో బ్యాటర్లు, బౌలర్లు కూడా చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా బ్యాటర్లలో నలుగురు జట్టు విజయానికి పిల్లర్లుగా నిలబడిపోతున్నారు.
రచిన్ రవీంద్ర...
ఇతను నిజానికి ఆల్ రౌండర్. బ్యాటింగ్ తోనూ , అవతల బౌలింగ్ తోనూ కూడా ప్రత్యర్థలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. ఈఛాంపియన్స్ ట్రోఫీలో రచిన్ మూడు మ్యాచ్ లు ఆడితే అందులో రెండింటిలో సెంచరీలు చేశాడు. టోర్నీలో టాప్ స్కోరర్లలో ఒకడుగా ఉన్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడు. భారత బౌలింగ్ అలవాటు ఉన్నవాడు కూడా.
కేన్ మామ..
కీవీస్ లో భారత జట్టుకు పెద్ద విలన్ కేన్ విలియమ్స్. ఇంతకు ముందు చాలా సార్లు మన బౌలర్లుకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్లను చితక్కొట్టడంలో ఇతని తర్వాతే ఎవరైనా. గ్రూప్ మ్యాచ్ లో టీమ్ ఇండియాపై కేన్ మామ 81 పరుగులు కూడా చేశాడు. సెమీ ఫైనల్స్ లో సఫారీల మీద అద్భుతమైన సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇతన్ని వీలైనంత తొందరగా పెవిలియన్ బాట పట్టిస్తేగానీ లాభం లేదు.
గ్లెన్ ఫిలిప్స్..
న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను ఒంటిచేత్తో ఓడించగల సామర్థ్యం కలిగి ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. ధనాధన్ ఆడతాడు. మిడిలార్డర్ లో వచ్చి వేగంగా పరుగులు చేస్తాడు.
డారిల్ మిచెల్..
డారెల్ మిచెల్ కూడా గ్లెన్ లాంటివాడే. సెమీఫైనల్లో మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇతని వల్లనే సెమీ ఫైనల్స్ లో కీవీస్ జట్టు అత్యధిక స్కోరు చేయగలిగింది. ఇతన్ని కూడా వేగంగా పడగొట్టాల్సిందే. ఈనలుగురిని భారత స్పిన్నర్లు వేగంగా దెబ్బ తీయాలి. లేదంటే భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది.
Also Read: Champions Trophy: 14 వన్డేల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ..ఫైనల్స్ లో అయినా గెలుస్తాడా?