/rtv/media/media_files/2025/02/03/PBkz7In4njnvxeCal7NA.jpg)
chandramukhi
ఏదైనా రాసిపెట్టి ఉండాలి అని అంటుంటారు పెద్దలు.. అవును అది సినిమాల విషయంలో కూడా వర్తిస్తుంది. సినిమాలలో పాత్రల కోసం పలనా హీరో,హీరోయిన్లను అనుకుంటూ ఉంటారు మేకర్స్. కానీ కథ, పాత్రలు నచ్చకపోవడం, డెట్స్ అడ్జెట్స్ కాకపోవడం వలన వారు సినిమాలను వదలుకుంటూ ఉంటారు. ఇది ఇండస్ట్రీలో సహజమే. చంద్రముఖి సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. అవును.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించారు. మళయాళంలో వచ్చిన మణిచిత్రతాయు సినిమాకు ఇది రీమేక్ .. మణిచిత్రతాయు సినిమాను ముందుగా కన్నడలో రీమేక్ చేశారు. దీనికి పి వాసు దర్శకత్వం వహించగా విష్ణువర్ధన్, సౌందర్య కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాను కన్నడలో చూసిన తెలుగు దర్శకుడు విఎన్ ఆదిత్య మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ చిరు రీమేక్ ను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఇది పట్టాలెక్కలేదు. అయితే ఈ సినిమాను కన్నడలో చూసిన రజినీకాంత్ వెంటనే దీనిని తమిళ్, తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. శివాజీ ప్రొడక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నట్లుగా స్వయంగా రజినీకాంత్ ప్రకటించారు. ఇది వారికి 50వ సినిమా కావడం విశేషం.
స్నేహను అనుకుని, సిమ్రాన్ ను తీసుకుని
ఇక క్యాస్టింగ్ మొదలైంది. ముందుగా గంగ పాత్రకు అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన స్నేహను అనుకున్నారు. ఆ తరువాత సిమ్రాన్ ను తీసుకున్నారు. ఆమె రెండురోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే ప్రెగ్నె్ంట్ అని తెలియడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్‌కి ఆ పాత్రను ఆఫర్ చేశారు కానీ ఆమె తిరస్కరించింది. దీంతో సదా, రీమా సేన్ లను ప్రత్యామ్నాయంగా అనుకున్నారు.
ఫైనల్ గా జ్యోతికను తీసుకున్నారు. 50 రోజుల పాటు ఆమె డేట్స్ కేటాయించింది. ఇక దుర్గ పాత్ర కోసం నయనతారను తీసుకున్నారు మేకర్స్. ముందుగా నాగవల్లి అనే టైటిల్ అనుకుని ఆ తరువాత చంద్రముఖిగా మార్చారు. రజినీకాంత్ స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి, కేవలం కథను మాత్రమే దృష్టిలో పెట్టుకుని టైటిల్ పెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు మేకర్స్. లకలక అనే డైలాగ్ ను పెట్టింది రజినే కావడం విశేషం. ఈ సినిమా కోసం రజినీ రూ. 15 కోట్ల పారితోషకం తీసుకున్నారు.
Also read : 26 ఏళ్ల సమరసింహారెడ్డి.. బొడ్డు సీన్ కోసం బాలయ్యనే రిజెక్ట్ చేసిన హీరోయిన్