RR vs KKR : ఏంటీ ఇదంతా PR స్టంటా..కాళ్లు మొక్కడానికి పరాగ్ పదివేలు ఇచ్చాడా?

RR, KKR మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. RR ఫీల్డింగ్ చేసే సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు. నేరుగా వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. దీనిని పరాగ్ చేసిన PR స్టంట్ అని నెటిజన్లు అభివర్ణించారు.

New Update
riyan parag

riyan parag

గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు. నేరుగా అతను గ్రౌండ్ లోకి వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని స్టేడియం బయటకు లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  దీనిని పరాగ్ చేసిన PR స్టంట్ అని అభివర్ణించారు.

Also Read :  షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్‌ మెడిసిన్ ధరలు

PR స్టంట్ కు ప్లాన్ చేసి

సంజు శాంసన్ వేలికి గాయం కావడంతో ఐపీఎల్ 2025 సీజన్‌లోని మొదటి మూడు ఆటలకు రియాన్ పరాగ్‌ను  రాజస్థాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా నియమించింది . ఐపీఎల్  కెప్టెన్‌గా తన అరంగేట్రంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్   44 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని ఎదురుకుంది.  రెండో మ్యాచ్ పరాగ్ సొంత గ్రౌండ్ అయిన గువాహటిలో జరిగింది.  రియాన్ పరాగ్ కు కూడా రోహిత్ శర్మ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారా అని మరికొంత మంది నెటిజన్లు  ప్రశ్నించారు. మీడియా అటెన్షన్  కోసమే పరాగ్ రూ.  10 వేలు ఇచ్చి ఇలాంటి PR స్టంట్ కు ప్లాన్ చేసి ఉంటాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

Also Read :  బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!

Also Read :  అమెరికాలో RWA పై ఆంక్షలు..!

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో  కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్151 పరుగులు చేసింది. ఛేదనలో డికాక్ (97*) రఘువనీ (22*)తో కలిసి ఆడుతూ పాడుతూ కేకేఆర్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్ తో  కేకేఆర్ కు ఇది తొలి విజయం కాగా  రాజస్థాన్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి. కెప్టెన్ పరాగ్ రెండో మ్యాచ్ లో 25 పరుగులు మాత్రమే చేశాడు. 

Alos read :  Yashasvi Jaiswal : టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

 

Guwahati | riyan-parag | KKR vs RR | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు