కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్

హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకున్న తర్వాత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీల్ వైరల్ అవుతోంది.

FotoJet (28
New Update

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా తన 31వ పుట్టిన రోజును ఒంటరిగా జరుపుకున్నాడు. కానీ మరోవైపు అతని మాజీ భార్య నటాషా యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో కలిసి విహరిస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్‌ రీల్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒంటరిగా పాండ్యా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు నటాషా మాత్రం కొత్త బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నా తప్పుల నుంచి నేర్చుకోవాలని.. 

నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా తన మొదటి పుట్టినరోజు జరుపుకున్నాడు. పడిలేచినట్లుగా ఈ సంవత్సరం ఉందని హార్దిక్ క్యాప్షన్ ఇచ్చాడు. సానుకూలత, ఆశయంతో ముందుకు సాగడానికి ఇదే మంచి సమయమని, నా తప్పుల నుంచి నేను చాలా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానని క్యాప్షన్ పెట్టాడు. కానీ నటాషా మాత్రం ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌తో కలిసి ఉన్న రీల్‌ను షేర్ చేసింది.

ఇది కూడా చూడండి: కళ్ల ముందే కదులుతున్న కారు దగ్ధం.. డ్రైవర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఎల్విష్ యాదవ్‌తో నటాషా డేటింగ్ చేస్తోందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే హార్దిక్ పాండ్యాలో క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉంటుంటే.. నటాషా మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఓ ఆల్బమ్ సాంగ్ లోనూ కనిపించింది.

ఇది కూడా చూడండి: 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు

#natasha #hardhik-pandya #cricketer #elvish-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe