/rtv/media/media_files/2025/12/10/ipl-auction-2025-12-10-21-07-16.jpg)
ఈసారి ఐపీఎల్ మినీ వేలం అబుదాబిలో జరగనుంది. దీనికి అంతా రెడీ అయిపోయింది. డిసెంబర్ 16న ఫ్రాంఛైజీలన్నీ మినీ వేలంలో పాల్గొంటాయి. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత ధరలు పలికారో చూసుకుంటే.. మొట్టమొదటి సారిగా ఐపీఎల్ వేలం 2008లో ప్రారంభమైంది. దాని తరువాత 2025 వరకు మొత్తంగా 18 సార్లు వేలం జరిగింది. అన్నింటిలో కలిపి ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2025 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్కువ ధర పలికిన ప్లేయర్లు..
2008 వేలం: ఎంఎస్ ధోనీ,చెన్నై సూపర్ కింగ్స్- రూ.6 కోట్లు
2009 వేలం: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆర్సీబీ, సీఎస్కే- రూ.7.55 కోట్లు
2010 వేలం: షేన్ బాండ్, కీరన్ పొలార్డ్, (కేకేఆర్, ముంబై)-రూ.4.8 కోట్లు
2011 వేలం: గౌతమ్ గంభీర్,(కేకేఆర్)- రూ.11.04 కోట్లు
2012 వేలం: రవీంద్ర జడేజా,(సీఎస్కే)- రూ.12.8 కోట్లు
2013 వేలం: గ్లెన్ మ్యాక్స్‌వెల్,(ముంబై)- రూ.6.3 కోట్లు
2014 వేలం: యువరాజ్ సింగ్(ఆర్సీబీ)- రూ.14 కోట్లు
2015 వేలం: యువరాజ్ సింగ్(ఢిల్లీ డేర్ డెవిల్స్)- రూ.16 కోట్లు
2016 వేలం: షేన్ వాట్సన్(ఆర్సీబీ)- రూ.9.5 కోట్లు
2017 వేలం: బెన్ స్టోక్స్(రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్)- రూ.14.5 కోట్లు
2018 వేలం: బెన్ స్టోక్స్(రాజస్థాన్ రాయల్స్)- రూ.12.5 కోట్లు
2019 వేలం: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి(రాజస్థాన్, కేకేఆర్)- రూ.8.4 కోట్లు
2020 వేలం: ప్యాట్ కమిన్స్(కేకేఆర్)- రూ.15.5 కోట్లు
2021 వేలం: క్రిస్ మోరిస్(రాజస్థాన్)- రూ.16.25 కోట్లు
2022 వేలం: ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్)- రూ.15.25 కోట్లు
2023 వేలం: సామ్ కర్రన్(పంజాబ్ కింగ్స్)- రూ.18.5 కోట్లు
2024 వేలం: మిచెల్ స్టార్క్(కేకేఆర్)- రూ.24.75 కోట్లు
2025 వేలం: రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్)- రూ.27 కోట్లు
Follow Us