/rtv/media/media_files/2025/05/24/KegQ9GivhBlzsCML5Zw0.jpg)
DC VS PBKS
టాప్ ఫోర్ టీమ్స్ కు వరుసగా షాక్స్ తగులుతున్నాయి. గుజరాత్, ఆర్సీబీల వంతు అయిపోయింది ఇప్పుడు పంజాబ్ కు పడింది దెబ్బ. ప్లేఆఫ్స్ కు వెళ్ళిన టీమ్స్ ను...టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్లు వరుసగా ఓడిస్తున్నాయి. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ కు ఇదే అవమానం జరిగింది. ఢిల్లీ ఆ టీమ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. రిజ్వా సూపర్ ఇన్నింగ్స్ ఆడి డీసీను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 207 టార్గెట్ ను ఢిల్లీ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించేశారు. టోర్నీ నుంచి వెళ్ళిపోయిన జట్లలో ఒక్క సీఎస్కే తప్ప మిగతావన్నీ చివరి మ్యాచ్ ల్లో మెరుపులు మెరిపించి వెళ్ళిపోతున్నాయి.
రిజ్వా సూపర్ ఇన్నింగ్స్..
పంజాబ్ ఇచ్చిన లక్ష్య ఛేదనకు దిగిన డీసీ బ్యాటర్లు మొదటి నుంచి దూుడుగా ఆడారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ 21 బంతుల్లో 35, డుఫ్లేసిస్ 15 బంతుల్లో 23 పరుగులు చేశారు. వీరి తర్వాత వచ్చిన సెథిఖుల్లా అటల్ 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అయితే వీరందరి కన్నా మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రిజ్వా, కరుణ నాయర్ అసలైన ఆటను ఆడారు. మొత్తం మ్యాచ్ ను తమ చేతుల్లోకి తీసుకుని టీమ్ కు మరిచిపోలేని విజయాన్ని ఇచ్చారు. సమీర్ రిజ్వా 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 58 పరుగులు, కరుణ్ నాయర్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 44 పరుగులు చేశారు. రిజ్వా చివర్లో కొట్టిన సిక్స్ లతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబె ఒక్కో వికెట్ తీశారు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కూడా దుళ్ళగొట్టారు. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చారు. జోష్ ఇంగ్లిస్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 28 పరుగులు చేసి దూకుడుగా ఆడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులతో అర్ధ శతకం బాదగా.. చివర్లో స్టాయినిస్ 16 బంతుల్లో3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, విప్రాజ్ నిగమ్ 2, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | PBKS | dc | match