This week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లో  కొత్త సినిమాల జాతర.. సినీ లవర్స్ కి పండగే

ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీతో పాటు థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్దమయయ్యాయి. ముఖ్యంగా ఈ వారం వార్ 2, కూలీ రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

New Update

This week ott Movies:  ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీతో పాటు థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్దమయయ్యాయి. ముఖ్యంగా ఈ వారం ఎన్టీఆర్ 'వార్ 2',  రజినీకాంత్ 'కూలీ' రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఓటీటీలో వివిధ భాషలకు చెందిన చిన్న సినిమాలు, సీరీస్ లు  సందడి చేయనున్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీలు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం థియేటర్ సినిమాలు

కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశా కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా  కీలక పాత్రలో నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది ఈ చిత్రం. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. 

వార్ 2 

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కూడా ఆగస్టు 14న విడుదలవుతోంది. దీంతో కూలీ వెర్సెస్ వార్ 2 గా బాక్సాఫీస్ పోటీ ఉండబోతుంది. ఇప్పటికే రజినీకాంత్  'కూలీ' సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. వార్ 2 ను మించి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని సమాచారం. మరి ఆగస్టు 14న బాక్సాఫీస్ హీరోగా నిలిచెదవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

 ఓటీటీలో సినిమాలు & వెబ్ సిరీస్‌లు

  • మోతెవరి లవ్ స్టోరీ

ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి  జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్. ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని 'మై విలేజ్ షో' ఫేమ్ శివకృష్ణ బుర్ర దర్శకత్వం వహించారు.  

  • మాయసభ (Mayasabha):

పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి  సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1990లలో జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కథ సాగుతుంది. దీనిని రాహీ అనిల్ డైరెక్ట్ చేశారు. 

  • అరేబియా కడలి:   అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 
  • ఓ ఎంథన్ బేబీ: ఆగస్టు 8 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది
  • లవ్‌హార్ట్స్‌ (హాలీవుడ్‌):  స్ట్రీమింగ్ ఇన్  జియో హాట్ స్టార్
  • మిక్కీ (హాలీవుడ్‌):  జియో హాట్ స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది
  • మామన్‌ (తమిళ్‌ మూవీ): జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. 
  •  ‘సలాకార్‌’: ది లెజెండ్‌ ఆఫ్ యాన్‌ ఎక్స్‌టార్డనరీ ఇండియన్‌ స్పై’ : జియో హాట్ స్టార్

Also Read:Kayadu Lohar: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న డ్రాగన్ బ్యూటీ.. ఒక్క ఫొటో చూస్తే కుర్రాళ్లు ఫ్లాటే!

Advertisment
తాజా కథనాలు