పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఓ జంటకు పది రోజుల క్రితం పెళ్లి అయింది.  ఎంజాయ్ చేయడానికి ఆ జంట హనీమూన్కు గోవా వెళ్లగా అక్కడ జరిగిన గొడవే  విడాకుల వరకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  ఇంతకు ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update
goa  hoenymoon

ఓ జంటకు పది రోజుల క్రితం పెళ్లి అయింది.  ఎంజాయ్ చేయడానికి ఆ జంట హనీమూన్కు గోవా వెళ్లగా అక్కడ జరిగిన గొడవే  విడాకుల వరకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  ఇంతకు ఏం జరిగిందంటే..  కొత్వాలి ప్రాంత నివాసి అయిన నవవధువుకు డాక్టర్ రత్నేష్ గుప్తాతో 2025 ఫిబ్రవరి 12న పెళ్లి అయింది.  అయితే పెళ్లయిన మరుసటి రోజు నుంచే  ఆమె అత్తమామలు వరకట్నం గురించి వేధించడం మొదలుపెట్టారు. 

Also read :  జీలకర్ర బెల్లంతో పెళ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకు.. యువతి ఫొటో వైరల్

ఫిబ్రవరి 19న హనీమూన్కు

ఈ క్రమంలో పెళ్లైయిన  కొత్త జంట ఫిబ్రవరి 19న హనీమూన్కు గోవాకు వెళ్లింది. గోవాలో కొత్త జంట మధ్య గొడవ జరగగా.. తన భర్త కొట్టాడని నవవధువు తన కుటుంబానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆమెను వెంటనే అక్కడినుంచి వచ్చేయమని కుటుంబసభ్యులు చెప్పేశారు. దీంతో ఆమె తన భర్తకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫిబ్రవరి 22న గోవా నుండి తన ఇంటికి విమానంలో వచ్చింది. 

Also Read :  Maha Sivaratri 2025: మహా శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు?

భర్తతో సహా 7 మందిపై

అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తతో సహా 7 మందిపై  ఫిర్యాదు చేసింది.  తన భర్త తనను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు దాడి, వరకట్న వేధింపులు వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతి తన భర్త నుంచి విడాకులు కోరినట్లుగా సమాచారం.  

Also read :  మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే.. పాపం దారుణం!

Also read : లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు