CEAT Cricket Awards 2025: క్రికెట్ అవార్డ్స్‌లో మెరిసిన ఆటగాళ్లు.. రోహిత్ శర్మకు దక్కిన అరుదైన గౌరవం!

27వ సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, క్రీడా నాయకులను సత్కరిస్తారు. అయితే సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.

New Update
CCR cricket awards

CCR cricket awards

27వ సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, క్రీడా నాయకులను సత్కరిస్తారు. అయితే ఈసారి సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమానికి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో భారత జట్టు గెలిచేలా చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. అలాగే టీమిండియా వరుసగా రెండోసారి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ క్రమంలో స్పష్టత, ప్రశాంతతతో కెప్టెన్సీ - 2025 అవార్డును రోహిత్ శర్మకు అందించారు. భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకున్నారు. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి ఆయన పబ్లిక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. అయితే రోహిత్ శర్మ రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. దీనికి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను సెలక్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: AUSTRALIA ODI SQUAD: ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బిగ్ షాక్.. జట్టులో దక్కని చోటు - కారణం ఇదే

మహిళల్లో స్మృతి మంధానకు..

ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్, కేన్ విలియమ్సన్ కూడా హాజరయ్యారు. ఇందులో సంజూ శాంసన్ "మెన్స్ టీ20ఐ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకున్నారు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి "మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు. అలాగే భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌కు "సీఈఏటీ జియోస్టార్ అవార్డు" లభించింది. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ "వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్"గా, ఆయన సహచరుడు హెన్రీ "వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యారు. మహిళా విభాగంలో స్మృతి మంధానకు "వుమెన్స్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్"గా, దీప్తి శర్మ "వుమెన్స్ బౌలర్ ఆఫ్ ది ఇయర్"గా అవార్డు అందుకున్నారు. 

ఇది కూడా చూడండి: Indian Cricket: 2027 వరల్డ్‌కప్‌ వారిద్దరు ఆడకుంటే క్రికెట్‌కే నష్టం.. మాజీ ఆటగాడు సంచలనం!

Advertisment
తాజా కథనాలు