Indian Cricket: రోహిత్ శర్మ ఉండగానే శుభ్ మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాతో జరిగితే మూడు వన్డేలకు గిల్ సారథ్యం వహించనుండగా రోహిత్, కోహ్లీలు కూడా ఈ సిరీస్ లో ఆడనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 2027 వరల్డ్ కప్ టోర్నీలో రోకో లు పాల్గొనడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డేల్లో మాత్రమే కొనసాగేందుకు ఆసక్తిచూపుతున్నారు. అయితే వరల్డ్ కప్ కు మరో రెండేళ్లు సమయం ఉండటంతో అప్పటివరకు రోకో వెయిట్ చేస్తారా? ఒకవేళ ఉన్నా వారికి జట్టులో చోటు దక్కుతుందా? అప్పటిదాకా ఫామ్ నిలబెట్టుకుంటారా? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక కామెంట్స్ చేశాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో రోకో జోడీ ఆడకపోతే క్రికెట్ కే ప్రమాదమంటూ హెచ్చరించాడు.
అది పెద్ద తప్పిదమే..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ తివారీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడించాలని సూచించాడు. 'రోకోను ఆడించకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుంది. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచే జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరమవుతున్నారు. తన నిర్ణయాలకు అడ్డు లేకుండా ఉండటం కోసమే అశ్విన్, రోహిత్, విరాట్‌ను జట్టులో లేకుండా చేశాడు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా వీడ్కోలు పలుకుతున్నారు. గంభీర్ వల్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది భారత క్రికెట్‌కు మంచిది కాదు. ఊహించనివిధంగా పలువురు ఆటగాళ్లు జట్టులోకి, నేరుగా తుది జట్టులోకి వస్తున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ ఎంతో చేశారు. డ్రెస్సింగ్ రూంలో ఉండటానికి ఇష్టపడని రోజు వారు రిటైర్ అవుతారు' అని చెప్పాడు.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!
అక్టోబర్ 19న మొదలు..
ఇక టీమిండియా త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి పెర్త్‌లో ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పటికే భారత్ వన్డే సిరీస్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆసీస్ కూడా తమ వన్డే జట్టును అనౌన్స్ చేసింది. దాదాపు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ రెగ్యులర్ వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. దీంతో క్రికెట్ ప్రియులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కమిన్స్‌కు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే కమిన్స్‌కు టీంలో చోటుదక్కకపోవడానికి ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి తీవ్ర గాయం కారణంగా ఆసీస్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కమిన్స్‌కు వెన్ను కింది భాగంలో గాయం కాగా.. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటున్నాడు. అందువల్లనే అతడికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని.. ముఖ్యంగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌కు కమిన్స్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Actor Sai Kiran: గుడ్ న్యూస్ చెప్పిన 'గుప్పెడంత మనసు' హీరో.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!!
Indian Cricket: 2027 వరల్డ్‌కప్ వారిద్దరు ఆడకుంటే క్రికెట్‌కే నష్టం.. మాజీ ఆటగాడు సంచలనం!
రోహిత్ శర్మ ఉండగానే శుభ్ మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాతో జరిగితే మూడు వన్డేలకు గిల్ సారథ్యం వహించనుండగా రోహిత్, కోహ్లీలు కూడా ఈ సిరీస్ లో ఆడనున్నారు.