/rtv/media/media_files/2025/10/07/australia-odi-squad-2025-10-07-11-59-15.jpg)
AUSTRALIA ODI SQUAD
టీమిండియా త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి పెర్త్‌లో ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పటికే భారత్ వన్డే సిరీస్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆసీస్ కూడా తమ వన్డే జట్టును అనౌన్స్ చేసింది. దాదాపు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ రెగ్యులర్ వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.
కమిన్స్‌కు దక్కని చోటు
దీంతో క్రికెట్ ప్రియులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కమిన్స్‌కు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే కమిన్స్‌కు టీంలో చోటుదక్కకపోవడానికి ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి తీవ్ర గాయం కారణంగా ఆసీస్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కమిన్స్‌కు వెన్ను కింది భాగంలో గాయం కాగా.. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటున్నాడు. అందువల్లనే అతడికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని.. ముఖ్యంగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌కు కమిన్స్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు. మార్ష్ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉండగా.. ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతడికి పూర్తి స్థాయి పగ్గాలు అప్పగించారు.
Australia announce squads for the India ODIs and first two T20Is! 🔥 pic.twitter.com/UjHX8K99FL
— CRICKETNMORE (@cricketnmore) October 7, 2025
ఆసీస్ జట్టులో కీలక మార్పులు
మార్నస్ లబుషేన్‌కు దక్కనిచోటు: వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు.. ఈసారి చోటు దక్కలేదు. మధ్య వరుస బ్యాటర్ అయిన లబుషేన్ ప్రస్తుత పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో క్వీన్స్‌లాండ్ బ్యాటర్ మ్యాథ్యూ రెన్షాకు అవకాశం దక్కింది.
స్టార్క్, హేజిల్‌వుడ్ రీ-ఎంట్రీ: స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి రావడంతో ఆసీస్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది.
మాక్స్‌వెల్‌కు విశ్రాంతి: మరో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా దూరం అయ్యాడు. అతడు మణికట్టు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే, టీ20 స్క్వాడ్‌లకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు
మిచెల్ మార్ష్ (C), గ్జావియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ (WK), కూపర్ కన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (WK), మిచెల్ ఓవెన్, మ్యాథ్యూ రెన్షా, మ్యాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.