BCCI: పాక్‌కి వెళ్లేది లేదు.. ఐసీసీకి తేగేసి చెప్పిన బీసీసీఐ పాకిస్థాన్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తి లేదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏడాది నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది. By Kusuma 15 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీకి టీమిండియా పాకిస్థాన్‌కి వెళ్లే ప్రసక్తి లేదని బీసీసీఐ ఐసీసీకి చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఈ టోర్నీ ఆ దేశంలో నిర్వహిస్తే ఆర్థికంగా కొంత వరకు బలపడుతుందని భావించి అక్కడ నిర్వహించాలనుకున్నారు. ఎలాగైన ఈ సారి పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహించాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. కానీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాక్‌కు వెళ్లేది లేదని చెబుతోంది. ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? What a twist! BCCI is proving to be the real boss. The Pakistan Cricket Board, which was making so much noise, now has to stay quiet. Word is that Pakistan might opt out of the 2025 Champions Trophy because India has confirmed it won’t allow Indian cricket team Pakistan to… pic.twitter.com/oi9k4qH0cQ — Statpadder (@The_statpadder) November 14, 2024 పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి భారీ నష్టం.. గతేడాదిలో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు ఆడింది. కానీ ఈసారి తప్పకుండా తమ దేశానికి రావాలని పాక్ నిర్ణయించుకుంది. అయితే ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పించుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి అందే నిధుల్లో ఐసీసీ కోత విధిస్తుంది. పాక్‌లో జరగాల్సిన టోర్నీని పోస్ట్ పోన్ చేసిన లేకపోతే వేరే దేశానికి పంపిన కూడా ఆతిథ్య ఫీజు కింద వచ్చే రూ.548 కోట్లు ఇక పాకిస్థాన్‌కి రావు. ఇది కూడా చూడండి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా రాదని, బీసీసీఐ ఐసీసీకి ఓ లేఖ రాసింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ఏడాది నుంచి పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది. ఇది కూడా చూడండి: Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు భారత్ జట్టు చివరిసారిగా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించింది. మళ్లీ ఇప్పటివరకు ఆ దేశంలో ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో రద్దు చేస్తే ఇక ఆ దేశానికి భారీ మొత్తంలోనే నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఇది గట్టి దెబ్బని చెప్పుకోవచ్చు. ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల! #pakistan #bcci #india-vs-pakistan #champions-trophy-2025 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి