మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జోఫ్ బెజోస్(60) తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను(54) క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కొలరాడోలోని ఆస్పెన్‌లో డిసెంబర్ 25న జరగనుంది. By Kusuma 15 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్(60) మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియురాలు అయిన లారెన్ శాంచెజ్‌ను క్రిస్మస్ రోజును పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే కొలరాడోలోని ఆస్పెన్‌లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది వీరికి నిశ్చితార్థం అయినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం! రూ.21 కోట్ల రింగ్‌తో ప్రపోజ్.. జెఫ్ బెజోస్ తన ప్రియురాలికి 2.5 మిలియన్ డాలర్లు అనగా దాదాపుగా 21 కోట్లు వజ్రాల ఉంగరంతో శాంచెజ్‌కు ఓ లగ్జరీ నౌకలో ప్రపోజ్ చేశారు. లారెన్ శాంచెజ్ జర్నలిస్ట్‌గా పనిచేసేవారు. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే శాంచెజ్ తన భర్తకు విడాకులు ఇవ్వకముందు నుంచే జెఫ్ బెజోస్, ఈమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా చూడండి: అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్.. జెఫ్ బెజోస్, లారెన్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కి విడాకులు ఇచ్చారు. విడాకుల మందు నుంచే లారెన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విడాకుల తర్వాత వీరి రిలేషన్‌ను జెఫ్ బెజోస్ బయటపెట్టారు. ఇది కూడా చూడండి: Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ ది వ్యూ, కేటీ టీవీ, ఫాక్స్ 11 వంటి ప్రముఖ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా లారెన్ గతంలో పనిచేశారు. ప్రపంచంలోనే అపర కుబేరుడు జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ విలువ దాదాపుగా 235 బిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 2 లక్షల కోట్లు అన్నమట. ఇది కూడా చూడండి: Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి #amazon founder #Jeff Bezos Marriage #Lauren Sanchez #jeff-bezos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి