Ind vs Aus: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీని దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను పక్కనపెట్టాలని టీమ్ మెనేజ్ మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 22నుంచి ఆసీస్ తో జరగబోయే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించగా.. వచ్చే డబ్ల్యూటీసీపై బీసీసీఐ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్.. కివీస్ పైనే లాస్ట్ టెస్టు!
ఆ నలుగురు సూపర్ సీనియర్లు ఔట్..
న్యూజిలాండ్ తో సిరీస్ లో భారత్ దారుణంగా విఫలమైంది. త్వరలోనే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. నవంబర్ 10న భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. అయితే ఇప్పటికే జట్టును ప్రకటించినందున మార్పులు చేసే అవకాశం లేదు. కానీ ఇంగ్లాండ్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా అర్హత సాధించకపోతే.. ఆ నలుగురు సూపర్ సీనియర్లు యూకేలో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు వెళ్లరని చెప్పొచ్చు. ఈ నలుగురు స్వదేశంలో ఫైనల్ టెస్టు ఆడినట్లే అంటూ బీసీసీఐ అధికారి ఓ సందర్భంగా చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్..
ఇక నవంబర్ 22 నుంచి భాతర్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 4-0తో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్ లార్డ్స్ మైదానంలో జూన్ 11-15 న జరగనుంది.