AP News: ఏపీ ప్రజలకు అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్.. ఏపీలో మరో హామీ అమలుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. సంక్రాంతి కానుకగా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్ పై వివిధ రాష్ట్రాల్లో పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించినట్లు తెలుస్తోంది. By Nikhil 04 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ ప్రజలకు సంక్రాంతికి కొత్త గిఫ్ట్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధం అవుతోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఫ్రీ బస్ స్కీమ్ ను సంక్రాంతి నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు బ్లూప్రింట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న కర్నాటక, తెలంగాణకు వెళ్లిన అధికారులు అక్కడ అవలంభిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఏపీలో పథకం అమలుకు సంబంధించిన అంచనాలను రూపొందించారు.ఇది కూడా చదవండి: AP Jobs: ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాపై చంద్రబాబు సంచలన నిర్ణయం! ప్రతీ నెల రూ.375 కోట్ల ఖర్చు.. రాష్ట్రంలో నిత్యం 36 నుంచి 37 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మహిళలు 15 లక్షల వరకు ఉన్నారు. అయితే.. ఫ్రీ బస్ స్కీమ్ అమల్లోకి వస్తే ఈ సంఖ్య మరో ఐదు లక్షల వరకు అయినా పెరిగే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ను అమల్లోకి తెస్తే ప్రతీ నెల రూ. 375 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించారు.ఇది కూడా చదవండి: YCP-Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్! గత ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చింది. ఇప్పడు ఒక్కో హామీ అమలుపై దృష్టి సారించింది. ఇటీవల నెలకు మూడు గ్యాస్ సిలిండర్ లు అందించే స్కీమ్ ను ప్రారంభించింది కూటమి సర్కార్. తాజాగా ఫ్రీ బస్ స్కీమ్ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు భారీ నిధులను కేటాయించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి