రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్.. కివీస్‌ పైనే లాస్ట్ టెస్టు!

భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నా అద్భుతమైన క్రికెట్‌ ప్రయాణం ముగింపుదశకు చేరుకుంది. ఈ రంజీ సీజన్‌ నాకు చివరిది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. 2010లో అరంగేట్రం చేసిన సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.

New Update
erereretre

Cricket: భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల సాహా అంతర్జాతీయ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. ‘నా అద్భుతమైన క్రికెట్‌ ప్రయాణం ముగింపుదశకు చేరుకుంది. ఈ రంజీ సీజన్‌ నాకు చివరిది. బెంగాల్‌ తరఫున చివరిసారి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సీజన్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని భావిస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

వాంఖడే వేదికగా చివరి టెస్టు..

ఇక 2010లో ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన సాహా.. భారత్‌ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 1300లకు పైగా పరుగులు చేశాడు. ఇక 2021లో న్యూజిలాండ్ పై వాంఖడే వేదికగా చివరి టెస్టు ఆడిన సాహా.. ధోనీ, పంత్‌ తర్వాత అత్యధిక టెస్టు సెంచరీ (3)లు చేసిన భారత వికెట్ కీపర్ ఘనత సాధించాడు.  

ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ..

ఇక ఐపీఎల్‌లో 170 మ్యాచ్‌లు ఆడిన సాహా 1 సెంచరీ, 13 అర్ధశతకాలతో 2,934 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ టోర్నీల్లోనూ 14 సెంచరీలు చేసిన సాహా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 7వేలకు పైగా పరుగులు సాధించాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు