ASIA CUP: మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఆడుతుంది..పాకిస్తాన్ తో మ్యాచ్ పై బీసీసీఐ క్లారిటీ

సెప్టెంబర్ తొమ్మిది నుంచి యూఏఈ వేదికగా  ఆసియా కప్ మొదలవనుంది. ఇందులో టీమ్ ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడుతుందా లేదా అనే దానిపై ఇంత వరకు సందిగ్ధత నెలకొంది. కానీ మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఎవరితోనూ ఆడకుండా ఆపలేమంటూ బీసీసీఐ ఈరోజు  క్లారిషికేషన్ ఇచ్చింది. 

New Update
India vs England 5th T20I team india won by england

India vs England 5th T20I team india won by england Photograph: (India vs England 5th T20I team india won by england)

మరో రెండు రోజుల్లో ఆసియా కప్ మొదలవుతోంది. సెప్టెంబర్ 9వ తేదీన మొదటి మ్యాచ్ ఆఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. మరుసటి రోజు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇందులో పాకిస్తాన్ కూడా ఆడుతోంది. షెడ్యూల్ ప్రకారం భారత్, పాక్ ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగాలి. అయితే పహల్గాం దాడి తరువాత దాయాది దేశంతో ఏ రకమైన మ్యాచ్ లూ ఆడకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీలు కూడా దీన్ని సమర్ధించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ లు ఆడుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. 

మల్టీనేషనల్ టోర్నీల్లో అడ్డుకోలేము..

భారత్, పాకిస్థాన్‌ క్రీడలకు సంబంధించి  ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. టీమ్‌ఇండియా శత్రుదేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటుంది. కానీ, మల్టీ నేషనల్‌ ఈవెంట్లలో మాత్రం పాల్గొంటుంది. ఇది క్రికెట్ తో పాటూ మిగతా అన్ని ఆటలకూ వర్తిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఆసియా కప్ టోర్నీలో టీమ్ ఇండియా పాకిస్తాన్ తో తలపడే విషయమై క్లారిఫికేషన్ ఇచ్చారు. బీసీసీఐ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. దాని ప్రకారం ఆసియా కప్ మల్టీ నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీల కిందకు వస్తుంది. ఇలాంటి వేదికలపై భారత్‌తో స్నేహపూర్వకంగా లేని దేశాలతో ఆడటంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి ఆసియా కప్ లో టీమ్ ఇండియా అందరితో సమానంగా పాకిస్తాన్ తో కూడా మ్యాచ్ లు ఆడుతుందని దేవజిత్ తెలిపారు. ఆసియా కప్.. ఆసియా ఖండంలోని దేశాలు పాల్గొనే మల్టీనేషనల్‌ టోర్నమెంట్ కాబట్టి, మనం ఇందులో ఆడాల్సిందే. అదే విధంగా ఐసీసీ టోర్నమెంట్లలో కూడా భారత్ ఆడుతుందని చెప్పారు. కానీ ద్వైపాక్షిక సీరీస్ లలో మాత్రం భారత్, పాకిస్తాన్ లు ఎప్పుడూ ఆడవు అని దేవజిత్ స్పష్టం చేశారు. 

ఆసియా కప్‌ షెడ్యూల్‌ గ్రూప్‌ స్టేజ్‌

9 సెప్టెంబర్‌: అఫ్గానిస్థాన్‌ - హాంకాంగ్‌
10 సెప్టెంబర్‌: భారత్‌ - యూఏఈ
11 సెప్టెంబర్‌: బంగ్లాదేశ్‌ - హాంకాంగ్‌
12 సెప్టెంబర్‌: పాకిస్థాన్‌ - ఒమన్‌
13 సెప్టెంబర్: బంగ్లాదేశ్‌ - శ్రీలంక
14 సెప్టెంబర్‌: భారత్‌ - పాకిస్థాన్‌
15 సెప్టెంబర్‌: శ్రీలంక - హాంకాంగ్‌
16 సెప్టెంబర్‌: బంగ్లాదేశ్‌ - అఫ్గానిస్థాన్‌
17 సెప్టెంబర్‌: పాకిస్థాన్‌ - యూఏఈ
18 సెప్టెంబర్‌: శ్రీలంక - అఫ్గానిస్థాన్‌
19 సెప్టెంబర్‌: భారత్‌ - ఒమన్‌ 

సూపర్‌ 4

20 సెప్టెంబర్‌: గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 - గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
21 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 - గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2
23 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 - గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
24 సెప్టెంబర్‌: గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 - గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2
25 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2 - గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
26 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 - గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1

ఫైనల్‌ 

28 సెప్టెంబర్‌ : ఫైనల్‌ మ్యాచ్‌

Advertisment
తాజా కథనాలు