Asia Cup 2025: పోతే పొండి.. పాక్‌కు ICC బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఔట్?

హ్యాండ్ షేక్ వివాదంలో క్రమంగా పీసీబీ ఐసీసీని బెదిరించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీకి డిమాండ్ చేసింది. ఈ బెదిరింపులను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు.

New Update
Asia cup 2025

Asia cup 2025

ఆసియా కప్‌ 2025లో పాకిస్తాన్‌కు వరుస అవమానాలు జరుగుతున్నాయి. యూఏఈ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న భారత్,  పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ సమయంలో కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యర్థి సల్మాన్ అఘాతో హ్యాండ్‌షేక్ చేయడానికి నిరాకరించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో చేతులో పాక్ ఓటమిపాలైంది. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కోసం వెయిట్ చేశారు. కానీ టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: యువరాజ్ సింగ్, సోనూ సూద్‌కు ఈడీ నోటీసులు!

రిఫరీని తొలగించాలని..

ఈ హ్యాండ్ షేక్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఇండియాతో మ్యాచ్‌లో రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని, ఐసీసీ నియమాలను ఉల్లంఘించారని పీసీబీ ఐసీసీకి  తెలిపింది. ఈ ఫిర్యాదును ఐసీసీ కొట్టిపారేసింది. అయితే రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీకి డిమాండ్ చేసింది. ఏ మాత్రం కూడా పాక్ బెదిరింపులను ఐసీసీ పట్టించుకోలేదు. టోర్నీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అన్నట్లుగా ఐసీసీ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్ రిఫరీపై, హ్యాండ్‌ షేక్ సమస్యపై సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల పీసీబీ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాను సస్పెండ్ చేసింది.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. యూఏఈ ఘన విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్?

Advertisment
తాజా కథనాలు