BIG BREAKING: యువరాజ్ సింగ్, సోనూ సూద్‌కు ఈడీ నోటీసులు!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సోనూ సూద్, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ED నోటీసులు ​జారీ చేసింది.  సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను యువరాజ్ ప్రమోట్ చేశాడని తేలడంతో సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ నటుడు సోనూ సూద్, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ED నోటీసులు​జారీ చేసింది.  సోషల్ మీడియా వేదికగా పలు బెట్టింగ్ యాప్‌లను యువరాజ్ సింగ్ ప్రమోట్ చేశాడని తేలడంతో సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నటుడు సోను సూద్‌ను సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఆదేశించారు. ఇక క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సమన్లు​జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: World Championship: వరల్డ్ ఛాంపియన్ షిప్ స్పీడ్ స్కేటింగ్ లో రెండు బంగారు పతకాలు..

ఈ క్రికెటర్లను ప్రశ్నించిన ఈడీ..

ఈ మనీలాండరింగ్ కేసులో ఇది వరకే క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను ప్రశ్నించారు. ఈ కేసులో నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు పంపించారు. ఆమె విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ప్రశ్నించింది. ధావన్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా యాప్‌తో సంబంధాలు ఉన్నాయనే క్రమంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే అక్రమ బెట్టింగ్ అప్లికేషన్‌లకు సంబంధించిన అనేక కేసులను ఏజెన్సీ పరిశీలిస్తోంది. 

ఇది కూడా చూడండి: Asia Cup 2025: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. యూఏఈ ఘన విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్?

Advertisment
తాజా కథనాలు