/rtv/media/media_files/2025/01/06/T962nAbeKUvDRwMpywqM.jpg)
Dan Christian comes out of retirement
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం డేనియల్ క్రిస్టియన్.. థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి
ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే
ఇప్పటికి థండర్ ఆటగాళ్లు చాలా మంది మ్యాచ్‌లలో తీవ్రంగా గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో థండర్ జట్టుకు మరో ఆప్షన్ లేకపోవడంతో ఆ జట్టు యాజమాన్యం కోరిక మేరకు డేనియల్ క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బరిలోకి దిగాడు. కాగా ఇవాళ సిడ్నీ థండర్ బ్రిస్బేన్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో థండర్ మొదట బ్యాటింగ్ చేస్తోంది.
Dan Christian rolls back the years on his BBL comeback 🚀
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2025
(via @BBL) #BBL14 pic.twitter.com/P6jN7NWxYz
థండర్ ప్లేయర్లకు గాయాలు
ఇప్పటికే థండర్ ప్లేయర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది రోజుల కిందట డేనియల్ సామ్స్, కెమెరూన్ బాన్‌క్రాఫ్ట్ గ్రౌండ్‌లో గాయపడ్డారు. క్యాచ్ పట్టబోయి వీరిద్దరూ ఒకరినొకరు గట్టిగా గుద్దుకున్నారు. దీంతో సామ్స్‌ను గ్రౌండ్ నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లగా.. బాన్‌క్రాఫ్ట్ ముక్కుకు గాయమై లోపల నుంచి రక్తం కారింది.
ఇది కూడా చూడండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా
అలాగే తన భుజానికి సైతం పెద్ద గాయం అయింది. అంతక ముందు జేసన్ సంఘా, నిక్ మాడిసన్, తన్వీర్ సంఘా పలు గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇక ఆ జట్టులో ఉన్న సామ్ కొన్‌స్టాస్ జాతీయ జట్టులో ఆడుతున్నాడు. అలాగే మరికొద్ది రోజుల్లో లోకీ ఫెర్గూసన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ సైతం జట్టును వీడనున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని డేనియల్ క్రిస్టియన్ రంగంలోకి దిగాడు.
క్రిస్టియన్ రిటైర్మెంట్ ఎప్పుడు?
41 ఏళ్ల వయస్సు గల డేనియల్ క్రిస్టియన్ 2 ఏళ్ల కిందట తన రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరి సారిగా సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడు. అనంతరం సిడ్నీ థండర్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.