VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్ కోసం ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోహ్లీతో చర్చించగా సారథ్యం స్వీకరించేందుకు విరాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

author-image
By srinivas
VR
New Update

Kohli Captain: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ జట్టు కెప్టెన్ గా ఎన్నో మరుపురాని విజయాలు అందించిన కోహ్లీ.. టీ20, వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ గా తప్పుకుని ఆటగాడిగా వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీంతోపాటు మెగా టోర్నీ ఐపీఎల్ లోనూ ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతలనుంచి 2021 సీజన్ లో తప్పుకోగా.. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డుప్లెసిస్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ లో ఎలాగైన కప్ కొట్టాలనే లక్ష్యంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కసరత్తులు చేస్తోంది.

కెప్టెన్సీ స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్..

ఈ మేరకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం 2025 సీజన్‌లో బెంగళూరుకు కోహ్లి సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే మేనేజ్‌మెంట్, కోహ్లి మధ్య చర్చలు జరిగాయని, కెప్టెన్సీ స్వీకరించేందుకు కోహ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 2022 నుంచి బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న డుప్లెసిస్‌  40వ పడిలో అడుగుపెట్టగా.. ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్‌ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!

రిషబ్‌ పంత్‌ కోసం ప్రయత్నం..

మొదట శుభ్‌మన్‌ గిల్‌ కోసం బెంగళూరు ప్రయత్నించినా.. చర్చలు ఫలించలేదు. మరోవైపు ఆటగాళ్ల వేలం పాటలో రిషబ్‌ పంత్‌ కోసం గట్టిగా ప్రయత్నించాలని బెంగళూరు ప్లాన్ చేస్తోంది. ఇది జరగకపోతే బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీ ఖాయంగా కనిపిస్తోంది.  ఇక 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి విరాట్ సారథ్యం వహించగా.. 2016లో  ఫైనల్‌కు చేర్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఇది కూడా చదవండి: దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి

#virat-kohli #rcb #captain
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe