/rtv/media/media_files/2024/10/31/mOZjPUar8DPG4NhIYuiL.jpg)
దేశ వ్యాప్తంగా నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఈ పండగను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలంతా సోషల్ మీడియా వేదికగా దీవాలి విశేష్ తెలుపుతున్నారు.
రజిని ఇంటిముందు ఫ్యాన్స్ సందడి..
ఇదిలా ఉంటే దీపావళి పండగ సందర్భంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన హీరోకు స్వయంగా విషెష్ చెప్పడానికి ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఇంటి ముందు సందడి చేయగా.. వాళ్ళందరి కోసం రజనీకాంత్ ఇంటి బయటికొచ్చి మరీ అందరికీ అభివాదం చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట దీపావళి వేడుకలు.. @rajinikanth #DiwaliCelebrations #DiwaliFestival #RTV pic.twitter.com/ArjsakstQX
— RTV (@RTVnewsnetwork) October 31, 2024
Also Read : 'లక్కీ భాస్కర్' వచ్చేది ఆ ఓటీటీలోకే..?
ఆయన బయటికి వివాదంతో ఫ్యాన్స్ అరుపులు,కేకలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా రజినీకాంత్ ఈ దసరాకు 'వెట్టయ్యన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో హైర్ టాక్ రాబట్టగా.. తెలుగులో మిశ్రమ స్పందన అందుకుంది.
Also Read : చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు